తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో పాక్​ సైన్యం కాల్పులు- ఓ అధికారి మృతి - ceasefire news

పాకిస్థాన్​ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్​ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఓ సైన్యాధికారి అమరుడయ్యారు.

JK: One Junior Commissioner Officer (JCO) lost his life in ceasefire violation by Pakistan in Poonch
సరిహద్దులో పాక్​ సైన్యం కాల్పులు- ఓ అధికారి మృతి

By

Published : Nov 26, 2020, 9:34 PM IST

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్​ పుంఛ్​ జిల్లాలో సరిహద్దు వెంబడి భద్రతా సిబ్బంది లక్ష్యంగా కాల్పులు జరిపింది పాక్​ సైన్యం. ఈ ఘటనలో ఓ జూనియర్​ కమిషనర్​ అధికారి మృతి చెందారు.

జమ్ముకశ్మీర్​లోని నియంత్రణరేఖ వెంబడి మోర్టార్​ షెల్స్​తో పాక్​ దాడులకు పాల్పడింది. పాక్​ చర్యకు భారత సైన్యం దీటుగా బదులిచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:కశ్మీర్​లో ఉగ్రదాడి- ఇద్దరు జవాన్లు మృతి

ABOUT THE AUTHOR

...view details