తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ శాసన మండలి రద్దు.. 62 ఏళ్ల చరిత్రకు తెర - జమ్ముకశ్మీర్​ శాసన మండలి రద్దు

జమ్ముకశ్మీర్​ శాసన మండలిని రద్దు చేస్తూ పరిపాలన విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. మండలిలోని 116 మంది సిబ్బంది ఈనెల 22లోపు సాధారణ పరిపాలన విభాగంలో హాజరుకావాలని సూచించింది.

జమ్ముకశ్మీర్​ శాసన మండలి రద్దు

By

Published : Oct 17, 2019, 4:22 PM IST

జమ్ముకశ్మీర్​ త్వరలోనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనున్న నేపథ్యంలో ప్రభుత్వ పరిపాలన విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. శాసన మండలిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలతో 62 ఏళ్ల చరిత్రకు ముగింపు పలికినట్లయింది.

మండలిలోని 116 మంది సిబ్బంది.. ఈనెల 22లోపు సాధారణ పరిపాలన విభాగంలో హాజరుకావాలని ఆదేశించారు ప్రభుత్వ కార్యదర్శి ఫరూక్​ అహ్మద్​ లోన్. మండలి కోసం కొనుగోలు చేసిన వాహనాలను ప్రభుత్వ మోటారు గ్యారేజీలకు పంపాలని.. మండలి భవనం, సామగ్రి, ఎలక్ట్రానిక్​ పరికరాలను ఎస్టేట్​ డైరెక్టర్​కు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

అక్టోబర్​ 31 అర్ధరాత్రి నుంచి...

అక్టోబర్​ 31 అర్ధరాత్రి నుంచి జమ్ముకశ్మీర్​ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు.. లద్దాఖ్​, జమ్ముకశ్మీర్​గా విడిపోనుంది. దేశ రాజధాని దిల్లీ తరహాలో జమ్ముకశ్మీర్​కు అసెంబ్లీ ఉంటుంది.

1957లో ఏర్పాటు...

జమ్ముకశ్మీర్​ శాసన మండలిని 1957లో ఏర్పాటు చేశారు. ఇందులో 36 మంది సభ్యులు ఉంటారు. 87 స్థానాలు కలిగిన రాష్ట్ర అసెంబ్లీకి ఎగువసభగా పనిచేసేది.

ఇదీ చూడండి: సౌదీ ప్రమాదంలో భారతీయులు ఉన్నారా!

ABOUT THE AUTHOR

...view details