జమ్ము కశ్మీర్లో ప్రయాణించే వాహనదారులకు ఊరటనిస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది అక్కడి పరిపాలన విభాగం. జమ్ము-పఠాన్‌కోట్ రహదారి వెంబడి ఉన్న లఖన్పూర్తో సహా ఇతర టోల్ పోస్ట్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియ నూతన సంవత్సరం 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు ప్రణాళిక,పర్యవేక్షణ, అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి రోహిత్ కంసల్ మీడియా సమావేశంలో ప్రకటించారు. దీని వల్ల ఏడాదికి రూ.1500కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతామని పేర్కొన్నారు.
స్థానిక పరిశ్రమల పోటీతత్వాన్ని మెరుగుపరిచేందుకు, తగిన సూచనలు ఇవ్వడానికి వివిధ వాటదారులతో చర్చలు జరుపుతామని తెలిపారు రోహిత్ కంసల్. ఇందుకోసం ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయించిదని వెల్లడించారు.
"2020జనవరి 1వ తేదీ నుంచి లఖన్‌పూర్, విమానాశ్రాయాలు, రైల్వే స్టేషన్స్‌తో సహా ఇతర పోస్టులు వద్ద టోల్ ఛార్జీల వసూళ్లను రద్దు చేశాం. ఈ టోల్ ఛార్జీలు రద్దు చేయడం వల్ల ఏడాదికి రూ.1500కోట్ల ఆదాయం నష్టం వాటిల్లతోంది."
-రోహిత్ కంసల్, ప్రణాళిక,పర్యావేక్షణ, అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి.