తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంట్లోనే శానిటైజర్లు తయారు చేసుకోండిలా.. - sanitizer making procedure at home

కరోనా కోరలు చాస్తున్న వేళ శానిటైజర్ల కోసం సూపర్​ మార్కెట్లలో క్యూలు కట్టనవసరంలేదు. మెడికల్​ షాపుల్లో రూ.వందలు వెచ్చించనవసరం లేదు. అసలు శానిటైజర్లేవో, కల్తీ శానిటైజర్లేవో తెలియక తికమకపడనవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు మీ ఇంట్లోనే శానిటైజర్లు తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

jivaji-university-students-made-homemade-sanitizer-corona-virus
ఇంట్లోనే శానిటైజర్లు తయారు చేసుకోండిలా..

By

Published : Mar 21, 2020, 8:10 AM IST

ఇంట్లోనే శానిటైజర్లు తయారు చేసుకోండిలా..

కరోనాను దరి చేర్చేవి మన చేతులే. అవి శుభ్రంగా ఉంచుకోకపోతే వైరస్​ను బొట్టు పెట్టి మరీ ఆహ్వానించినట్టే అవుతుంది. అందుకే శానిటైజర్ల వాడడం తప్పనిసరి అయ్యింది. అయితే కరోనా దెబ్బకి మార్కెట్​లో శానిటైజర్ల కొరత ఏర్పడి ధర ఆకాశన్నంటుతోంది. ఇదే అదునుగా కల్తీరాయళ్లు రెచ్చిపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఇంట్లోనే శానిటైజర్​ తయారు చేసుకునే చిట్కాను చెబుతున్నారు మధ్యప్రదేశ్ గ్వాలియర్​లోని జీవాజీ వర్సిటీ వైద్యవిద్యార్థులు.

వందల రూపాయలు వెచ్చించి మార్కెట్​లో రసాయన శానిటైజర్లను కొనుగోలు చేసే బదులు.. కేవలం రూ.70 నుంచి రూ.80 పెట్టి ఇంట్లోనే ఆరోగ్యానికి హాని చేయని శానిటైజర్లను తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకులు.

"శానిటైజర్​ తయారు చేసేందుకు ఐసోప్రొఫైల్ ఆల్కహాల్​ ఉపయోగిస్తాం. అందులో కలబంద గుజ్జు, రోజ్​వాటర్​, డిస్టిల్డ్ వాటర్​, కాస్త గ్లిసరిన్​ వేసి బాగా కలిపాం. కలబంద గుజ్జు చేతుల్లోని తేమ పోకుండా చేస్తుంది. ఐసోప్రొఫైల్​ ఆల్కహాల్​లోని లక్షణాలు చేతులను పొడిబారుస్తాయి. కేవలం ఐసోప్రొఫైల్​ ఆల్కహాల్​ను కూడా శానిటైజర్​లా వినియోగించవచ్చు​. అయితే అలా చేయడం వల్ల కొన్ని దుష్ప్రభావాలకు అవకాశం ఉంది."

-డాక్టర్​ వర్ష, శాస్త్రవేత్త

తయారీ ఇలా..

100 మిల్లీలీటర్ల శానిటైజర్​ తయారు చేయాలనుకుంటే.. కేవలం 40మిల్లీలీటర్ల ఐసోప్రొఫైల్ ఆల్కహాల్​, 10మిల్లీలీటర్ల కలబంద గుజ్జు, 5-10మి.లీల రోజ్​వాటర్​, 40మి.లీ డిస్టిల్డ్ వాటర్(పరిశుభ్రమైన నీరు) తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమంలో మూడు చుక్కల గ్లిసరిన్​ను వేయాలి. అంతే... మీ చేతులను పరిరక్షించే ​శానిటైజర్ తయారైనట్టే.

ఇదీ చదవండి:కరోనా వల్ల వరుడు లేకుండానే పెళ్లి అయిపోయింది!

ABOUT THE AUTHOR

...view details