ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జియో గిగా ఫైబర్ సెప్టెంబర్ 5న ప్రారంభం అవుతుందని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశం వేదికగా ఈ విషయం వెల్లడించారు.
మూడేళ్ల క్రితం సెప్టెంబర్ 5న రిలయన్స్ జియో ప్రారంభమై సంచలనాలు సృష్టించింది.
గిగా ఫైబర్ ధరలు ఇలా..
వేగం..100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ ధర.. రూ.700 నుంచి రూ.10,000
సేవలు
⦁ జియో గిగా ఫైబర్, సెట్‌టాప్‌బాక్సు ద్వారా వీడియో కాల్‌సేవలు
⦁ ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా కాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాల్ సేవలు
⦁ సెట్ టాప్ బాక్సు ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా వీడియో కాల్ ఉచితం
⦁ జియో గిగా ఫైబర్ ద్వారా సోషల్ గేమింగ్ పేరిట మల్టిపుల్ గేమింగ్ సేవలు
⦁ మిక్స్‌డ్ రియాలిటీ(ఎమ్మార్) పేరిట సరికొత్త వర్చువల్-ఆగ్మెంటెడ్ రియాలిటీ అనుభూతి
⦁ ఏఆర్, వీఆర్ సేవల కలయికగా మిక్స్‌డ్‌రియాలిటీ(ఎమ్మార్)
⦁ ఎమ్మార్ ద్వారా అధునాతనమైన విజ్ఞాన, వినోద సేవలు
అంతర్జాల ఆధారిత సేవలన్నీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నం చేసింది రిలయన్స్ సంస్థ. జియో గిగా ఫైబర్, సెట్‌టాప్ బాక్స్, మిక్స్‌డ్ రియాలిటీ(ఎమ్మార్) కలయికగా సరికొత్త విప్లవానికి నాంది పలికింది రిలయన్స్. 'ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్' కాన్సెప్ట్ ద్వారా ఈ సేవలను అందించనుంది.