కర్ణాట బళ్లారి జిల్లా తొరంగల్లులోని జిందాల్ ఉక్కు పరిశ్రమ కరోనా కేసులతో సతమతమవుతోంది. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఫ్యాక్టరీలో పనిచేసే 10 వేల మంది ఉద్యోగులను గృహ నిర్బంధంలో ఉంచాలని నిర్ణయం తీసుకుంది యాజమాన్యం.
గత తొమ్మిది రోజుల్లోనే జిందాల్ టౌన్షిప్ పరిసరాల్లోని 20 ప్రాంతాల్లో కరోనా విజృంభించింది. దీంతో చుట్టుపక్కల గ్రామాలను కట్టడి చేశారు పోలీసులు. ఆరోగ్య, రెవెన్యూ శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నవారి సమాచారం తీసుకుంటున్నారు. దీంతో జిందాల్ గ్రూప్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక డిప్యూటి కమిషనర్ ఎస్ ఎస్ నకుల్ సూచనల మేరకు.. 10,751 మంది ఉద్యోగులను నాలుగు రోజుల పాటు ఇంటికే పరిమితం చేశారు.