ఝార్ఖండ్లో 24 గంటల్లో వేర్వేరు చోట్ల పిడుగులు పడిన ఘటనల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గిరిడీ జిల్లా బర్నీ, అరారా ప్రాంతాల్లో మహిళ సహా ముగ్గురు చనిపోయారు. లోహర్దగ్గా జిల్లాలో ఇద్దరు వ్యక్తులు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు చిన్నారులు తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.