తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఝార్ఖండ్​: ప్రభుత్వ ఏర్పాటుకు సోరెన్​కు ఆహ్వానం

జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్​ సోరెన్​ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఝార్ఖండ్ గవర్నర్​ ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. హేమంత్​ ఈ నెల 29న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Jharkhand Governor invites Hemant Soren to form government
ఝార్ఖండ్​: ప్రభుత్వ ఏర్పాటుకు సోరెన్​కు గవర్నర్​ ఆహ్వానం

By

Published : Dec 25, 2019, 5:41 PM IST

Updated : Dec 25, 2019, 8:20 PM IST

ఝార్ఖండ్​: ప్రభుత్వ ఏర్పాటుకు సోరెన్​కు ఆహ్వానం

ఝార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్​ను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు. హేమంత్​ ఈ నెల 29 మొహ్రాబాది మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు రాజ్​భవన్​ వర్గాలు తెలిపాయి.

అంతకుముందు ఝార్ఖండ్​ గవర్నర్​తో హేమంత్​ సోరెన్​ సమావేశమయ్యారు. కాంగ్రెస్​, ఆర్​జేడీ, ఝార్ఖండ్ వికాస్​ మోర్చాకు (ప్రజాతాంత్రిక్​) చెందిన 50 మంది ఎమ్మెల్యేల మద్దుతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు.

కూటమికి 47 స్థానాలు...

81 స్థానాలు ఉన్న ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​-జేఎంఎం-ఆర్​జేడీ కూటమి మొత్తం 47 (జేఎంఎం-30, కాంగ్రెస్​-16, ఆర్​జేడీ-1) స్థానాల్లో గెలుపొంది సాధారణ మెజార్టీ కన్నా 5 సీట్లు ఎక్కువ సాధించింది. భాజపా కేవలం 25 సీట్లకు పరిమితమై.. అధికారాన్ని కోల్పోయింది.

ఇదీ చూడండి:అయోధ్యకు ఉగ్రదాడుల ముప్పు- భద్రత కట్టుదిట్టం

Last Updated : Dec 25, 2019, 8:20 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details