హిమాలయాల్లో చిక్కుకుపోయిన 60 మంది వలస కూలీలను స్వరాష్ట్రానికి తీసుకొచ్చింది ఝార్ఖండ్ ప్రభుత్వం. రెండు నెలల అనిశ్చితి తర్వాత లద్దాఖ్‌లోని సరిహద్దు రహదారుల నిర్మాణం కోసం పనిచేస్తున్న 60 మంది కూలీలు ప్రత్యేక విమానం ద్వారా దిల్లీకి చేరుకున్నారని.. అక్కడి నుంచి మరోక విమానంలో ఝార్ఖండ్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వమే సొంత ఖర్చులతో విమాన మార్గం ద్వారా కూలీలను స్వరాష్ట్రానికి రప్పించటం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.
"విమానంలో ప్రయాణించేటప్పుడు మేఘాల్లో విహరించినట్లు ఉంది. లద్దాఖ్ నుంచి దిల్లీకి విమానానంలో ప్రయాణించటం ఇదే తొలిసారి. రాంచీ ప్రయాణనమే నా చివరి విమాన ప్రయాణం కావచ్చు. ఈ అనుభూతిని ఎప్పటికీ మరువలేను. లద్దాఖ్‌లో చిక్కుకుపోయినప్పుడు నా పిల్లలను ఎప్పటికి కలుసుకోలేనేమో అని బాధపడేవాన్ని."
-ఓ వలస కార్మికుడు
వీరికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాత స్వరాష్ట్రానికి వెళేందుకు అనుమతినిచ్చినట్లు బీఆర్ఓ అధికారులు వెల్లడించారు.