తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రశాంతంగా ఝార్ఖండ్​ నాలుగో విడత పోలింగ్​

ఝార్ఖండ్​ విధానసభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్​ ప్రారంభమైంది. 15 నియోజకవర్గాల్లో మొత్తం 221 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.

Jharkhand election
ప్రశాంతంగా ఝార్ఖండ్​ నాలుగో విడత పోలింగ్​

By

Published : Dec 16, 2019, 8:51 AM IST

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో, సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ఉదయాన్నే పోలింగ్​ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ప్రజలు.

ప్రశాంతంగా ఝార్ఖండ్​ నాలుగో విడత పోలింగ్​

15 నియోజకవర్గాలు..

15 నియోజకవర్గాల్లో మొత్తం 221 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 23 మంది మహిళలు ఉన్నారు. 47, 85,009 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 6101 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరగనుండగా.. 4296 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. భద్రత కారణాలతో జమువా, బగోడర్, గిరిధ్, దుమ్రి, తుండి స్థానాల్లో 3 గంటల వరకు మాత్రమే ఓటుహక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది.

70 కేంద్రాల్లో మహిళా భద్రతా సిబ్బంది..

పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నెలకొని ఉన్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 70 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళా భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నారు.

బరిలో ప్రముఖులు..

ఝార్ఖండ్ కార్మికశాఖ మంత్రి రాజ్ పాలివార్, రెవెన్యూ శాఖ మంత్రి అమర్​కుమార్ బౌరీ నాలుగో దశ పోలింగ్​లో బరిలో నిలిచారు. మధుపుర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న పాలివార్ జేఎంఎం అభ్యర్థి హుస్సేన్ అన్సారీ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. అమర్​కుమార్ బౌరీ ఎన్​డీఏ పక్ష పార్టీ ఏజేఎస్​యూ ఉమాకాంత్ రజాక్​తో తలపడుతున్నారు. జరియా ఎన్నికపైనా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళా అభ్యర్థులు జరియా నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. భాజపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ సతీమణి రజిని సింగ్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి దివంగత నీరజ్​ సింగ్ సతీమణి పూర్ణిమ బరిలో నిలిచారు. నీరజ్​సింగ్​ హత్య కేసులో ఆరోపణలతో ఎమ్మెల్యే సంజీవ్​ సింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

భాగస్వాములు కావాలి: మోదీ

మోదీ ట్వీట్​

ఝార్ఖండ్​ విధానసభ నాలుగో విడత ఎన్నికలు ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములై తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటింగ్​ శాతాన్ని పెంచాలని కోరారు.

ఇదీ చూడండి: అబలలపై అఘాయిత్యాలు- సమాజం మారేదెన్నడు?

ABOUT THE AUTHOR

...view details