తబ్లిగీ జమాత్‌లో పాల్గొని, మసీదులో దాగి ఉన్న నేరానికి మూడు నెలలు జైలు శిక్ష అనుభవించిన 17 మంది విదేశీయులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది ఝార్ఖండ్‌లోని రాంచీ కోర్టు. ఈ మేరకు జస్టిస్ ఫాహీమ్ కిర్మాణి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా విస్తరిస్తోన్న తరుణంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు రూ. 2,200 చొప్పున జరిమానా కూడా విధించింది ధర్మాసనం.
వారంతా మలేసియా, బ్రిటన్, నెదర్లాండ్, జాంబియా, కరేబియన్ దీవులకు చెందిన వారుగా అధికారులు తెలిపారు. మలేసియాకు చెందిన ఓ మహిళకు కరోనా సోకినట్లు వెల్లడించారు.