తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఝార్ఖండ్​ : కాంగ్రెస్​ కూటమికే ప్రజలు పట్టం! - ASSEMBLY ELECTIONS

Jharkhand: Counting of votes for #JharkhandAssemblyPolls
ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ ప్రారంభం

By

Published : Dec 23, 2019, 8:00 AM IST

Updated : Dec 23, 2019, 4:20 PM IST

16:19 December 23

ఝార్ఖండ్ పోరు: కాషాయానికి షాక్​- కాంగ్రెస్​ కూటమికే పట్టం!

ఝార్ఖండ్​లో మరోమారు భాజపా ప్రభుత్వం ఏర్పడే అవకాశం కనపడటం లేదు. జేఎంఎం నేతృత్వంలోని కూటమి.. మెజారిటీ వైపు అడుగులు వేస్తోంది. తాజా ట్రెండ్స్​ ప్రకారం.. 81 స్థానాలున్న ఝార్ఖండ్​ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల్లో ఇప్పటికే కూటమి ముందంజలో ఉంది. 

ఝార్ఖండ్​లో జేఎంఎం నేతృత్వంలోని​ కూటమి ఆధికారం చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. 81 నియోజకవర్గాలున్న ఝార్ఖండ్​ శాసనసభలో ఇప్పటికే అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది కూటమి. భాజపా ఎదురీదుతోంది.

ఎన్నికల ఫలితాలు సానుకూలంగా ఉండటం వల్ల కాంగ్రెస్​ కార్యకర్తలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్నారు. 

దిగ్గజాల పరిస్థితి..

ఎన్నికల ఫలితాల్లో విజయంపై ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్​... కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా జేఎంఎం నేత హేమంత్​ సొరేన్​ను ప్రకటించింది. హేమంత్​ బోర్​హైత్​, దుంకా సీట్లల్లో దూసుకుపోతున్నారు. 

తాజా ఫలితాలతో భాజపా గర్వం దిగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కర్త అజయ్​ శర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రఘుబర్​ దాస్​కు గడ్డుకాలం ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఆయన బరిలో దిగిన తూర్పు జంషెడ్​పుర్​లో స్వతంత్ర అభ్యర్థి సరయు రాయ్​ ముందంజలో ఉన్నారు. సరయు భాజపా రెబల్​ కావడం గమనార్హం. మరి కొందరు సీనియర్​ భాజపా మంత్రులు సీపీ సింగ్​, అనిల్​ కుమార్​ బౌరి ముందంజలో ఉండగా.. రాజ్​ పాలివార్​ వెనుకంజలో ఉన్నారు. గత అసెంబ్లీలో స్పీకర్​గా ఉన్న దినేశ్​ ఓరేన్ వెనుకంజలోనే ఉన్నారు.

81 స్థానాలున్న ఝార్ఖండ్​ శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్ల బలం ఉండాలి.
 

16:07 December 23

కూటమిదే పీఠం!

ఝార్ఖండ్​లో మరోమారు భాజపా ప్రభుత్వం ఏర్పడే అవకాశం కనపడటం లేదు. జేఎంఎం నేతృత్వంలోని కూటమి.. మెజారిటీ వైపు అడుగులు వేస్తోంది. తాజా ట్రెండ్స్​ ప్రకారం.. 81 స్థానాలున్న ఝార్ఖండ్​ అసెంబ్లీలో భాజపా 31 స్థానాల్లో ముందంజలో ఉంది. కూటమి 40స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ముఖ్యమంత్రి రఘుబర్​ దాస్​ తూర్పు జంషెడ్​పుర్​లో వెనుకంజలో ఉన్నారు. 
 

14:29 December 23

రఘుబర్​ దాస్​ వెనుకంజ...

అధికార పార్టీ తూర్పు జంషెడ్​పుర్​ అభ్యర్థి, సీఎం రఘుబర్​ దాస్​ ఎన్నికల ఫలితాల్లో వెనుకంజలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి సరయు రాయ్​ దాదాపు 4 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. 

14:10 December 23

3 స్థానాల్లో ఫలితం...

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి గెలుపు దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. జేఎంఎం, కాంగ్రెస్​, ఆర్జేడీ కూటమి 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్​ రెండు స్థానాల్లో ఖాతా తెరిచింది. అధికార భాజపా రెండు చోట్ల గెలిచి.. మరో 27 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. ఆల్​ ఝార్ఖండ్​ స్టూడెంట్స్​ యూనియన్​(ఏజేఎస్​యూ) ఒక స్థానంలో గెలిచి .. 3 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 

12:54 December 23

ఝార్ఖండ్​ జోష్​లో కాంగ్రెస్​-సంబరాలు షురూ

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా కాంగ్రెస్-జేఎంఎం కూటమి దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట కార్యకర్తలు పటాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు.

ఎన్నికల సంఘం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ 12, జేఎంఎం 25, భాజపా 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

ఈ ఫలితాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రణవ్​ ఝా సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

12:47 December 23

వెనుకంజలో రఘుబర్​ దాస్​

తాజా ట్రెండ్స్​ ప్రకారం... తూర్పు జెంషడ్​పుర్​లో రఘుబర్​ దాస్​ వెనుకంజలో ఉన్నారు. ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి సరయూ రాయ్​​ 771 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.

11:43 December 23

ఝార్ఖండ్‌ శాసనసభ ఎన్నికల్లో విపక్ష కాంగ్రెస్- జేఎంఎం కూటమి అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా దూసుకెళ్తోంది. 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. జేఎంఎం 23, కాంగ్రెస్​ 12, ఆర్జేడీ 5 చోట్ల లీడ్​లో కొనసాగుతున్నాయి. భాజపా 28 స్థానాల్లో ముందంజతో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశముంది. 

10:29 December 23

ఆధిక్యంలో దూసుకెళ్తోన్న కూటమి...

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​లో అధికార భాజపా వెనుకంజలో ఉంది. జేఎంఎం, కాంగ్రెస్​, ఆర్జేడీ కూటమి దూసుకెళ్తోంది. మొత్తం 43 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. భాజపా.. 27 స్థానాల్లోనే ముందంజలో ఉంది. 

10:21 December 23

ఉత్కంఠగా ఎన్నికల కౌంటింగ్​.. ఆధిక్యంలో కూటమి

  • ఝార్ఖండ్‌లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్‌-జేఎంఎం కూటమి మధ్య హోరాహోరీ పోరు
  • మెజారిటీ మార్కుకు కొద్దిదూరంలో కూటమి పార్టీలు నిలిచే అవకాశాలు
  • ఏజేఎస్‌యూ, జేవీఎం పార్టీలు కీలకమయ్యే సూచనలు
  • ఫలితాలపై మధ్యాహ్నం కల్లా రానున్న స్పష్టత
  • ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ 41 స్థానాలు

10:11 December 23

ఝార్ఖండ్​లో కొనసాగుతోన్న కౌంటింగ్​.. కూటమికి ఆధిక్యం

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భాజపా 34 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు కూటమి 38 స్థానాల్లో ముందంజలో దూసుకెళ్తోంది. 

09:33 December 23

ఆధిక్యంలో రఘుబర్​ దాస్​

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​లో క్షణక్షణానికి ఆధిక్యం చేతులుమారుతోంది. భాజపా 32, కూటమి 36 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఆరంభంలో వెనుకంజలో ఉన్న సీఎం రఘుబర్​ దాస్ ఆధిక్యంలోకి వచ్చారు. ​ 

09:20 December 23

సీఎం రఘుబర్​దాస్​ వెనుకంజ

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగుతోంది. 34 పైచిలుకు స్థానాల్లో జేఎంఎం, కాంగ్రెస్​, ఆర్జేడీ కూటమి ఆధిక్యంలో ఉంది. భాజపా 30 స్థానాల్లో లీడ్​లో కొనసాగుతోంది. జంషెడ్​పుర్​ నుంచి పోటీచేసిన సీఎం రఘుబర్​దాస్​ వెనుకంజలో ఉన్నారు. 

08:48 December 23

ఆధిక్యంలో కూటమి

ఝార్ఖండ్​ ఎన్నికల ఫలితాల తొలి రౌండ్లో కూటమి 33 స్థానాలతో ఆధిక్యంలో కొనసాగుతోంది. 21 స్థానాలతో భాజపా రెండో స్థానంలో ఉంది.
 

08:34 December 23

మాదే ప్రభుత్వమంటూ కూటమి పోస్టర్​

ఝార్ఖండ్​ రాంచీలో మహాకూటమి ప్రభుత్వమే రాబోతుందని చెబుతూ పోస్టర్​ వెలిసింది. ఝార్ఖండ్​ ప్రజలు కూటమి సర్కారుకే మద్దతుగా ఉన్నారని, హేమంత్​ సోరెన్​ మరోసారి ముఖ్యమంత్రి కానున్నారని ఈ పోస్టర్​లో ఉంది. 
 

08:28 December 23

దుమ్కాలో కొనసాగుతున్న లెక్కింపు

ఝార్ఖండ్​ దుమ్కాలో కౌంటింగ్ ప్రారంభమయింది. లెక్కింపు కేంద్రం పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. 

07:41 December 23

ఝార్ఖండ్​ : కాంగ్రెస్​ కూటమికే ప్రజలు పట్టం!

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో​ ప్రారంభమైంది. నవంబర్​ 30 నుంచి ఈ నెల 20 వరకు మొత్తం 5 దశల్లో 81 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పటిష్ట భద్రత నడుమ 24 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 1,216 మంది అభ్యర్థుల భవితవ్యం మధ్యాహ్నం కల్లా తేలనుంది. 

ఎగ్జిట్​ పోల్​ సర్వేలు ఈసారి అధికార భాజపాకు కష్టమేనని అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్​జేడీ కూటమికే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నాయి. హంగ్ ఏర్పడే అవకాశమూ ఉన్నట్లు కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి.

భాజపాకు కష్టమేఎగ్జిట్ పోల్​ సర్వేలు ఈసారి అధికార భాజపా నెగ్గడం కష్టమేనని అంచనా వేస్తున్నాయి. అసెంబ్లీలో జెండా ఎగరేయబోయేది కాంగ్రెస్-జేఎంఎం-ఆర్​జేడీ కూటమేనని చెబుతున్నాయి. హంగ్ ఏర్పడే అవకాశమూ లేకపోలేదని అంటున్నాయి.

కీలక నేతలకు పదవీ గండంప్రస్తుతం రాష్ట్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలు అసెంబ్లీ ఫలితాల్లో ఓటమిని చూసే అవకాశం ఉందని తేలుస్తున్నాయి సర్వేలు. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ సహా పలువురు ప్రముఖుల భవితవ్యం ఫలితాల అనంతరం పూర్తిగా మారే పరిస్థితి కనిపిస్తుందని అంచనా వేస్తున్నాయి.ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం 2020 జనవరి 5తో ముగుస్తుంది. 2000లో బిహార్​ నుంచి విడివడి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత ఝార్ఘండ్​లో జరిగిన నాలుగో అసెంబ్లీ ఎన్నికలివి.

Last Updated : Dec 23, 2019, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details