తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఝార్ఖండ్​ ఎన్నికలకు మోగిన నగారా- 5 దశల్లో పోలింగ్ - ఝార్ఖండ్​ ఎన్నికల న్యూస్​

ఝార్ఖండ్​ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. 81 స్థానాలకు 5 దశల్లో పోలింగ్​ జరగనుంది. తొలి దశ నవంబర్​ 30న జరగనుంది. డిసెంబర్ 23న ఫలితం వెలువడనుంది.

ఝార్ఖండ్​ ఎన్నికలకు మోగిన నగారా- 5 దశల్లో పోలింగ్

By

Published : Nov 1, 2019, 4:58 PM IST

Updated : Nov 1, 2019, 5:28 PM IST

ఝార్ఖండ్​ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. నక్సల్​ ప్రభావిత రాష్ట్రంలోని 81 నియోజకవర్గాలకు నవంబర్​ 30 నుంచి ఐదు దశల్లో పోలింగ్​ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్​ 23న ఎన్నికల ఫలితం వెలువరించనున్నట్లు తెలిపింది.

ఝార్ఖండ్​ ఎన్నికల షెడ్యూల్​

  • తొలి దశ: నవంబర్​ 30
  • రెండో దశ: డిసెంబర్​ 7
  • మూడో దశ: డిసెంబర్ 12
  • నాల్గవ దశ: డిసెంబర్ 16
  • ఐదవ దశ: డిసెంబర్ 20
  • ఎన్నికల ఫలితాలు: డిసెంబర్ 23

ఝార్ఖండ్​తో పాటు దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్​ విడుదల చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. కానీ.. దీనిపై ఈసీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

2014 ఎన్నికల్లో భాజపా విజయం..

ఝార్ఖండ్​లో 81 స్థానాలకుగాను 2014 నవంబర్​ 25-డిసెంబర్​ 20 మధ్య ఐదు దశల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపా 37 స్థానాల్లో విజయం సాధించింది. ఆల్​ ఝార్ఖండ్​ స్టూడెంట్స్​ యూనియన్​ (5)తో జట్టు కట్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా రఘుబర్​దాస్​ బాధ్యతలు చేపట్టారు.

కాంగ్రెస్​ పార్టీ 7 స్థానాలకే పరిమితమైంది. ఝార్ఘండ్​ ముక్తి మోర్చా 19, ఝార్ఘండ్​ వికాస్​ మోర్చా 8 సీట్లు సాధించాయి.

ప్రస్తుత శాసనసభ కాల పరిమితి జనవరి 5తో ముగుస్తుంది.

ఆపరేషన్​ ఆకర్ష్​...

శాసనసభ ఎన్నికలకు ముందు నలుగురు విపక్ష ఎమ్మెల్యేలు అధికార భాజపాలో చేరారు. ఇద్దరు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు సుఖ్​దేవ్​ భగత్​, మనోజ్​ యాదవ్​, ఝార్ఖండ్​ ముక్తి మోర్చా (జేఎంఎం) నుంచి కునాల్​ సారంగి, స్వతంత్ర ఎమ్మెల్యే భాను ప్రతాప్​ సాహి భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

ఇదీ చూడండి: రోడ్డుపై గుంత ఉందా...? అయితే ఓ సెల్ఫీ కొట్టండి!

Last Updated : Nov 1, 2019, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details