తెలంగాణ

telangana

'సోరెన్ అను నేను'-ఝార్ఖండ్​ 11వ సీఎంగా ప్రమాణం

By

Published : Dec 29, 2019, 2:20 PM IST

Updated : Dec 29, 2019, 4:36 PM IST

ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధ్యక్షుడు హేమంత్​ సోరెన్​ ఝార్ఖండ్​ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాంచీలోని మోరాబది మైదానంలో అగ్రనేతల మధ్య సీఎంగా బాధ్యతలు స్వీకారించారు.

jharkhand 11th cm hemanth soren swearing in
'సోరెన్ అను నేను'-ఝార్ఖండ్​ 11వ సీఎంగా ప్రమాణం

ప్రమాణస్వీకార వేడుక

ఝార్ఖండ్​ 11వ ముఖ్యమంత్రిగా ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) అధ్యక్షుడు హేమంత్​ సోరెన్​ ప్రమాణస్వీకారం చేశారు. రాజధాని రాంచీ మోరాబది మైదానంలో జరిగిన వేడుకలో రాష్ట్ర గవర్నర్​ ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. హేమంత్​ సోరెన్​ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​, డీఎంకే అధినేత స్టాలిన్, సీపీఎం, సీపీఐ నేతలు సీతారాం ఏచూరీ, డి. రాజా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సహా పలువురు అగ్రనేతలు హాజరయ్యారు.

ఘన విజయంతో..

81 స్థానాలు ఉన్న ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్​-ఆర్​జేడీ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 47 (జేఎంఎం-30, కాంగ్రెస్​-16, ఆర్​జేడీ-1) స్థానాల్లో గెలుపొంది సాధారణ మెజార్టీ కన్నా 5 సీట్లు ఎక్కువ సాధించింది. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్ వికాస్ మోర్చాకు చెందిన ముగ్గురు శాసనసభ్యులు, ఒక సీపీఎం సభ్యుడు జేఎంఎం కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో అధికార భాజపా పార్టీ 25 స్థానాలతో సరిపెట్టుకుని అధికారాన్ని కోల్పోయింది.

హేమంత్ సోరెన్ అను నేను.. రెండోసారి

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం హేమంత్ సోరెన్​కు ఇది రెండోసారి. గతంలో 2013లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు సోరెన్​. 1 సంవత్సరం 5 నెలల 15 రోజులు తొలిసారి పదవిలో కొనసాగారు.

ఇదీ చూడండి: ఆకులతో బొగ్గు తయారీ- కార్చిచ్చు, కాలుష్యానికి చెక్​!

Last Updated : Dec 29, 2019, 4:36 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details