ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 17 నియోజకవర్గాల్లోని 7,016 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ పూర్తయింది. 309 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. 62.68శాతం పోలింగ్ నమోదనైట్లు అధికారులు తెలిపారు. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.
బరిలో ప్రముఖులు..
మూడో విడత ఎన్నికలో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ వికాస్ మోర్చా అధ్యక్షుడు బాబులాల్ మరండి (ధన్వార్ నియోజకవర్గం), విద్యాశాఖ మంత్రి నీరా యాదవ్ (కొడర్మ) బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన ఏజేఎస్యూ పార్టీ అధినేత, మాజీ ఉపముఖ్యమంత్రి సుదేశ్ మహ్తో సిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఈ నెల 16, 20 తేదీల్లో నాలుగు, ఐదో విడత పోలింగ్ జరగనుంది. 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చూడండి: 'పౌర' సెగ: రణరంగంలా ఈశాన్య భారతం