తెలంగాణ

telangana

'పుల్వామా తరహా కారుబాంబు కుట్రను భగ్నం చేశాం'

కశ్మీర్​ పుల్వామాలో కారు బాంబును నిర్వీర్యం చేసిన అనంతరం కీలక వివరాలు వెల్లడించారు పోలీసులు. ఈ ఉగ్రదాడికి జైషే మహమ్మద్​ కీలకంగా వ్యవహరించగా హిజ్బుల్ ముజాహిద్దీన్​ సాయం అందించినట్లు తెలిపారు. ముందస్తు సమాచారంతో గతేడాది జరిగిన పుల్వామా స్థాయి ఉగ్రదాడిని భగ్నం చేయగలిగామన్నారు.

By

Published : May 28, 2020, 2:17 PM IST

Published : May 28, 2020, 2:17 PM IST

Pulwama
పుల్వామా

గతేడాది ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఉగ్రదాడి తరహా కుట్రను భగ్నం చేశామని కశ్మీర్​ పోలీసులు ప్రకటన చేశారు. పుల్వామాలో కారుబాంబును నిర్వీర్యం చేసిన అనంతరం కశ్మీర్​ ఐజీ విజయ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.

"జైషే మహమ్మద్​కు చెందిన ఉగ్రవాది ఆదిల్​ దాడికి పాల్పడుతున్నాడని మాకు సమాచారం అందింది. భద్రతా దళాల వాహనాలను కారు ద్వారా ఢీకొట్టి పేల్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ వాహనంలో 40- 45 కిలోల పేలుడు పదార్థాలు ఉండవచ్చు. ఈ కుట్రలో జైషే సంస్థ ప్రధాన పాత్ర వహించగా హిజ్బుల్ ముజాహిద్దీన్​ సాయం అందించింది. ఇది 2019 ఫిబ్రవరిలో సీఆర్​పీఎఫ్​ వాహనాలపై జరిగిన ఉగ్రదాడి తరహాలోనిదే."

- ఐజీ విజయ్​ కుమార్​

ఈ దాడి కోసం జైషే, హిజ్బుల్ సంస్థలు కలిసి వేస్తున్న ప్రణాళికలకు సంబంధించి మాకు ఎప్పటికప్పుడు సమాచారం అందిందని విజయ్ తెలిపారు. సాంట్రో కారులో ఐఈడీ బాంబును బిగించినట్లు తెలియగానే అప్రమత్తంగా వ్యవహరించినట్లు స్పష్టం చేశారు.

"అక్కడి నుంచి ఉగ్రవాది మొదటిసారి బయటికి వచ్చినప్పుడే కాల్పులు జరిపి హెచ్చరించాం. చీకట్లో తప్పించుకుని పారిపోతుండగా మరో బృందం కాల్పులు జరిపింది. తర్వాత మళ్లీ నంబర్​ ఆధారంగా ఆ వాహనాన్ని వెతికిపట్టుకున్నాం. అందులోని బాంబును నిర్వీర్యం చేశాం. పరిసర ప్రాంతాల్లోని స్థానికులను ఖాళీ చేయించాం. అనంతరం ఆ కారును పేల్చివేశాం."

- ఐజీ విజయ్​ కుమార్​

పుల్వామా దాడి..

గతేడాది పుల్వామా జిల్లాలో 2,500 మందితో వెళుతున్న సీఆర్​పీఎఫ్​ వాహన శ్రేణిని ఒక సూసైడ్ బాంబర్​ కారుతో వచ్చి ఢీకొట్టాడు. ఈ ఉగ్రదాడిలో 40 మంది సీఆర్​పీఎఫ్ జవాన్లు మృతిచెందారు. చాలా మంది గాయపడ్డారు.

ఇదీ చూడండి:పుల్వామాలో భారీ ఉగ్రదాడికి కుట్ర..!

ABOUT THE AUTHOR

...view details