తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నీట్, జేఈఈ వాయిదాకై 6 రాష్ట్రాల మంత్రుల పిటిషన్​

నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని సుప్రీంకోర్టును అశ్రయించారు ఆరు రాష్ట్రాల మంత్రులు. పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని గతంలో ఇచ్చిన తీర్పును పునర్​సమీక్షించాలని కోరారు.

JEE, NEET row: Six states file review petition in SC for exam postponement
నీట్, జేఈఈ వాయిదాకై 6 రాష్ట్రాల మంత్రుల పిటిషన్​

By

Published : Aug 28, 2020, 1:01 PM IST

Updated : Aug 28, 2020, 1:27 PM IST

సెప్టెంబరులో జరగాల్సిన నీట్​, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి భాజపాయేతర పాలనలోని ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలు. పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని గతంలో ఇచ్చిన తీర్పును పునర్​సమీక్షించాలని కోరాయి.

ఈ మేరకు ఆరు రాష్ట్రాల మంత్రులు(బంగాల్​ నుంచి మొలోయ్​ ఘటక్​, ఝార్ఖండ్​ నుంచి రామేశ్వర్​ ఒరాన్​, రాజస్థాన్ నుంచి రఘు శర్మ, ఛత్తీస్​గఢ్ నుంచి అమర్జీత్ భగత్, పంజాబ్​ నుంచి బీఎస్ సిద్దు, మహారాష్ట్ర నుంచి ఉదయ్ రవీంద్ర సావంత్​) సుప్రీంలో రివ్యూ పిటిషన్​ దాఖలు చేశారు.

నీట్, జేఈఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని ఆగస్టు 17న తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. కరోనా కారణంగా ఎంతో విలువైన ఏడాది కాలాన్ని విద్యార్థులు కోల్పోవడానికి వీల్లేదని తెలిపింది.

నీట్​, జేఈఈ వాయిదా కోసం న్యాయపోరాటం చేసే అంశంపై ఇటీవల భాజపాయేతర పార్టీల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చ జరిగింది.

ఇదీ చూడండి: బిహార్ ఎన్నికల వాయిదాపై పిటిషన్​ కొట్టివేత

Last Updated : Aug 28, 2020, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details