తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా - జేఈఈ ఫలితాల్లో తెలంగాణ రికార్డ్

శుక్రవారం విడుదలైన జేఈఈ మెయిన్స్​ ఫలితాల్లో 24 మంది 100 శాతం మార్కులు సాధించారు. ఇందులో అత్యధికంగా 8 మంది తెలంగాణ నుంచే ఉన్నారు. దిల్లీ నుంచి ఐదుగురు, రాజస్థాన్​లో నలుగురు వంద శాతం స్కోరు సాధించగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఈ ఘనత అందుకున్నారు.

JEE-Main result declared; 24 candidates score 100 percentile
జేఈఈ మెయిన్స్ ఫలితాలు- 24 మందికి 100 శాతం

By

Published : Sep 12, 2020, 5:46 AM IST

జేఈఈ మెయిన్స్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో 24 మంది విద్యార్థులు 100 శాతం స్కోరు సాధించారు. ఇందులో తెలుగువారు 11 మంది ఉన్నారు.

తెలంగాణ నుంచి అత్యధికంగా 8 మంది వంద శాతం మార్కుల ఘనత అందుకోగా.. దిల్లీ నుంచి ఐదుగురు, రాజస్థాన్​లో నలుగురు, ఆంధ్రప్రదేశ్​లో ముగ్గురు, హరియాణాలో ఇద్దరు గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరు చొప్పున 100 పర్సంటైల్ సాధించారు.

కరోనా వల్ల రెండు సార్లు జేఈఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. చివరకు సెప్టెంబర్ 1-6 మధ్య పరీక్షలు నిర్వహించారు. 8.58 లక్షల మంది జేఈఈ మెయిన్స్​ పరీక్షల కోసం నమోదు చేసుకోగా.. 74 శాతం మంది హాజరయ్యారు.

జేఈఈ మెయిన్స్ పేపర్ 1, 2లలో వచ్చిన మార్కుల ఆధారంగా 2.45 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష రాసే అవకాశం లభిస్తుంది. అడ్వాన్స్​డ్ పరీక్ష ద్వారా భారత్​లోని ఐఐటీ సహా అత్యున్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్ పొందేందుకు వీలు కలుగుతుంది. సెప్టెంబర్ 27న జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details