తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జేఈఈ పరీక్ష ఆన్​లైన్​ దరఖాస్తుల గడువు పెంపు - when do JEE Main Exam held?

జేఈఈ మెయిన్​ పరీక్ష ఆన్​లైన్​ దరఖాస్తుల గడువు ఈ నెల 23 వరకు పొడిగిస్తూ జాతీయ పరీక్షల సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆన్​లైన్​ రసుములు చెల్లించేందుకు ఈనెల 24 వరకు గడువును పెంచింది.

JEE Main Exam Online Applications Deadline Extension
జేఈఈ మెయిన్​ పరీక్ష ఆన్​లైన్​ దరఖాస్తుల గడువు పెంపు

By

Published : Jan 16, 2021, 9:59 PM IST

జేఈఈ మెయిన్ మొదటి పరీక్ష కోసం ఆన్​లైన్ దరఖాస్తుల గడువును జాతీయ పరీక్షల సంస్థ(ఎన్​టీఏ) ఈనెల 23 వరకు పొడిగించింది. ఆన్ లైన్ లో రుసుములు చెల్లించేందుకు ఈనెల 24 వరకు గడువు పెంచింది. ఈనెల 27 నుంచి 30 వరకు దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని ఎన్​టీఏ తెలిపింది.

గత నెల 16 నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తుల గడువు నేటితో ముగిసింది. అయితే గోరఖ్​పూర్​లోని మదన్ మోహన్ మాలవీయ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ సీట్లను కూడా జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా భర్తీ చేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ దరఖాస్తుల గడువు పొడిగించినట్లు ఎన్​టీఏ పేర్కొంది.

ఫిబ్రవరితో పాటు మార్చి, ఏప్రిల్​, మే నెలల్లో కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇదివరకే వెల్లడించింది.

తొలిసారి ప్రాంతీయ భాషల్లో..

ఈ దఫా జేఈఈ మెయిన్స్‌ పరీక్షలను కొత్తగా ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంలో కేంద్రం నిర్వహించనుంది. దీని ప్రకారం 13 భాషల్లో విద్యార్థులు పరీక్షలు రాయవచ్చు. తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలి, గుజరాతి, కన్నడ, ఒడియా, పంజాబీ, ఉర్దూ భాషల్లో ప్రశ్నా పత్రాలు అందుబాటులో ఉంటాయి.

ఇదీ చూడండి:ఫిబ్రవరి 23 నుంచి జేఈఈ మెయిన్స్​

ABOUT THE AUTHOR

...view details