జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ తేదిని ప్రకటించారు మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్. ఆగస్టు 23న పరీక్ష ఉంటుందని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదిని ఖరారు చేసింది కేంద్రం. ఆగస్టు 23న పరీక్షను నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు.
ఆగస్టు 23న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష!
షెడ్యూల్ ప్రకారం మే 17న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించాలి. అయితే దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వాయిదా పడింది. జేఈఈ-మెయిన్స్‌ను జులై 18 నుంచి 23మధ్య నిర్వహించనున్నట్లు ఈనెల 5న ప్రకటించింది మానవ వనరుల శాఖ. తాజాగా అడ్వాన్స్డ్ పరీక్ష తేదీని ఖరారు చేసింది.
ఇదీ చూడండి:లాక్డౌన్ వేళ.. ప్రేయసి కోసం కాలినడకన 500 కి.మీ.!
TAGGED:
jee entrance