తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపాతో జేడీయూ కటీఫ్​- బిహార్​లో తప్ప!

జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగస్వామ్యాన్ని బిహార్​కే పరిమితం చేస్తున్నట్టు జనతా దళ్​ యునైటెడ్​ ప్రకటించింది. త్వరలో జరగబోయే జమ్ముకశ్మీర్​, ఝార్ఖండ్, హరియాణా, దిల్లీ శాసన సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

By

Published : Jun 9, 2019, 3:08 PM IST

Updated : Jun 9, 2019, 5:53 PM IST

జేడీయూ

భాజపాతో జేడీయూ కటీఫ్​- బిహార్​లో తప్ప!

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్​డీఏ)లో కొనసాగడంపై జనతా దళ్​ యునైటెడ్​ కీలక నిర్ణయం తీసుకుంది. భాజపాతో జాతీయ స్థాయిలో వేరు పడి.. పొత్తును బిహార్​కు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది. త్వరలో జరిగే జమ్ముకశ్మీర్​, ఝార్ఖండ్​, హరియాణా, దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని తీర్మానించింది.

ఈ రోజు జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది జేడీయూ.

అప్పుడే మొదలు

కేంద్ర మంత్రివర్గ కూర్పు సమయంలోనే భాజపా-జేడీయూ మధ్య భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. ఒక కేబినెట్​​ మంత్రి, ఒక స్వతంత్ర హోదా మంత్రి, ఒక సహాయ మంత్రి పదవులను కేటాయించాలని జేడీయూ కోరింది. ఇందుకు భాజపా నిరాకరించింది. కేబినెట్​లో జేడీయూకు ఒక్క స్థానమే ఇస్తామని తేల్చిచెప్పింది. ఫలితంగా కేంద్ర మంత్రివర్గంలో చేరలేదు జేడీయూ.

ఈ నెల 2న బిహార్​లో మంత్రివర్గాన్ని విస్తరించారు నితీశ్​. మంత్రి పదవి ఇచ్చేందుకు జేడీయూ సిద్ధమైనా... భాజపా తీసుకోలేదు. ఫలితంగా 8 మంది జేడీయూ నేతలు మాత్రమే కొత్తగా బిహార్​ మంత్రివర్గంలో చేరారు.

నితీశ్​కు భాజపా తప్పనిసరి

243 మంది ఎమ్మెల్యేలున్న బిహార్​ అసెంబ్లీలో ప్రస్తుతం జేడీయూ(73), భాజపా(54), ఎల్​జేపీ(2), ఐఎన్​డీ(4) కూటమిగా ఏర్పడి మొత్తం 133 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీ(79), కాంగ్రెస్​(27) కూటమికి మరిన్ని స్థానిక పార్టీలతో కలిపి మొత్తం 110 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒకవేళ భాజపా-జేడీయూ విభేదాలు మరింత ముదిరితే... నితీశ్​ కుమార్​ పదవికే ఎసరు వచ్చే ప్రమాదముంది.

ఇదీ చూడండి: 'కిశోర్​ వ్యవహారంతో మాకు సంబంధం లేదు'

Last Updated : Jun 9, 2019, 5:53 PM IST

ABOUT THE AUTHOR

...view details