బిహార్లో మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జేడీయూ 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మరో 7 స్థానాలను బిహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్ మోర్చా పార్టీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఈ మేరకు జేడీయూ పార్టీ అధ్యక్షుడు వశిష్ట నారాయణ సింగ్ తెలిపారు.
పర్సా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చంద్రికా రాయ్, చెనారి నియోజవర్గం నుంచి లాలన్ పాసవాన్, రూపౌలి నుంచి బీమా భారతి జేడీయూ తరఫున బరిలోకి దిగనున్నారు.