తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​ బరి: జేడీయూకు 122, భాజపాకు 121 స్థానాలు - బిహార్ అసెంబ్లీ ఎన్నికలు

bihar
జేడీయూ

By

Published : Oct 6, 2020, 5:24 PM IST

Updated : Oct 6, 2020, 6:25 PM IST

17:16 October 06

జేడీయూకు 122 సీట్లు.. భాజపాకు 121 స్థానాలు

బిహార్‌ శాసనసభ ఎన్నికల కోసం ఎన్డీఏలో సీట్ల పంపకం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. 243 స్థానాలకుగాను జేడీయూకు 122, భాజపాకు 121 స్థానాలు కేటాయించినట్లు బిహార్ సీఎం నితీశ్ కుమార్ వెల్లడించారు.  

జేడీయూకు కేటాయించిన సీట్లలో 7 స్థానాలను బిహార్‌ మాజీ సీఎం జితన్‌ రాం మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్‌ మోర్చాకు ఇవ్వనున్నట్లు బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ తనకు కేటాయించిన సీట్లలో కొన్ని వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీకి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకోసం చర్చలు జరుగుతున్నాయని నితీశ్ చెప్పారు.  

నితీశ్​ సారథ్యంలోనే..

లోక్‌ జన్‌ శక్తి పార్టీ బిహార్​లో కూటమి నుంచి వైదొలిగి, కేంద్రంలో మాత్రం ఎన్డీఏలో కొనసాగడంపై భాజపా స్పందించింది. నితీశ్‌ కుమారే తమ నేత అని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని బిహార్‌ భాజపా అధ్యక్షుడు సంజయ్‌ జైశ్వాల్‌ స్పష్టంచేశారు. లోక్‌జన శక్తి పార్టీ.. కేంద్రంలో తమకు భాగస్వామిగా ఉందని తెలిపారు.

ఇదీ చూడండి:లెక్కల చిక్కులు: మరో మిత్రపక్షంతో భాజపాకు ఇబ్బందులు!

Last Updated : Oct 6, 2020, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details