తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఏఏ రగడ: ప్రశాంత్​ కిశోర్​పై జేడీయూ వేటు - caa

పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్​ కిశోర్​, పవన్​ వర్మపై చర్యలు తీసుకుంది జేడీయూ అధిష్ఠానం. వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించింది.

JD(U) expels Prashant Kishor and Pavan Varma
సీఏఏ రగడ: ప్రశాంత్​ కిశోర్​పై జేడీయూ వేటు

By

Published : Jan 29, 2020, 4:33 PM IST

Updated : Feb 28, 2020, 10:11 AM IST

ఎన్నికల వ్యూహకర్త, పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్​ కిశోర్​, ప్రధాన కార్యదర్శి పవన్​ వర్మపై బహిష్కరణ వేటు వేసింది బిహార్​ అధికార పక్షం జేడీయూ. క్రమశిక్షణ తప్పి, పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టంచేసింది.

పౌరసత్వ చట్ట సవరణ, జాతీయ పౌర పట్టిక విషయంలో బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​తో విభేదిస్తూ ప్రశాంత్, పవన్​ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వారిని పార్టీ నుంచి బహిష్కరించింది జేడీయూ.

అసలేం జరిగింది?

ప్రశాంత్​ కిశోర్​ 2018 సెప్టెంబర్​లో జేడీయూలో చేరారు. నితీశ్​ కుమార్​ ఆయనను జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అయితే జేడీయూ మిత్రపక్షమైన భాజపాపై ప్రశాంత్​ కిశోర్​ కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో ఆ పార్టీని సమర్థించాలన్న జేడీయూ నిర్ణయాన్ని కిశోర్​ తప్పుబడుతున్నారు.

ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కన్నా ఎక్కువ సీట్లలో తమ పార్టీ పోటీ చేయాలన్నారు. దీనికితోడు దిల్లీలో ఆమ్​ఆద్మీ పార్టీ కోసం ఆయన పనిచేస్తున్నారు. అక్కడ ఎన్​డీఏ పక్షాలు ఆప్​తో తలపడుతున్నాయి.

పవన్​ వర్మ సైతం ఇదే తరహాలో జేడీయూ అధిష్ఠానంతో విభేదిస్తున్నారు.

Last Updated : Feb 28, 2020, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details