జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లో తల్లిదండ్రుల వివరాలకు సంబంధించిన ప్రశ్నలు తొలగించాలని కేంద్రాన్ని కోరింది జేడీయూ. దిల్లీలో జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశం వేదికగా ఈ అభ్యర్థన చేసింది. ఈ విషయాన్ని జేడీయూ నేత లలన్ సింగ్ వెల్లడించారు. దీనిపై చర్చ జరుపుతామని హోంమంత్రి అమిత్షా సమాధానమిచ్చినట్లు తెలిపారు.
జేడీయూ అభ్యర్థనను మరో కూటమి పార్టీ అకాలీ దళ్ కూడా సమర్థించిందని సమచారం.