భారత్- చైనా రెండవ ఉన్నత స్థాయి సమావేశాల కోసం భారత విదేశాంగ మంత్రి జయశంకర్ నేడు డ్రాగన్ దేశం వెళ్లనున్నారు. ఈ సమావేశంలో అన్ని రంగాల్లో ఇరు దేశాల పరస్పర సహకారంపై చర్చించనున్నారు. మెుదటి సమావేశంలో జరిగిన ఒప్పందాల పురోగతిపై సమీక్షిస్తారు.
ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య పర్యాటకం, సినిమా, మీడియా, ఆటలు సహా అన్ని రంగాల్లో ఇరు దేశాల పరస్పర సహకారంపై చర్చించేందుకు ఈ సమావేశం వేదిక కానుంది.
-విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ
ఈ సమావేశం ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ తరువాతి భేటీకి రంగం సిద్ధం చేయనున్నారు జయ్శంకర్.