తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జయలలిత ఆస్తులకు వారసులు వారే - జయలలిత వారసులు

జయలలిత ఎస్టేట్​తో పాటు రూ.900కోట్లకుపైబడిన ఆస్తులకు వారసులుగా.. ఆమె మేనకోడలు దీపా, మేనల్లుడు దీపక్​లను గుర్తించింది మద్రాసు హైకోర్టు. ఈ మేరకు జయలలిత ఆస్తులను పర్యవేక్షించే విధంగా వారికి అనుమతులిచ్చింది.

Jayalalithaa’s niece, nephew to inherit assets worth over Rs 900 crore
జయలలిత ఆస్తులకు వారసులు వీరే

By

Published : May 27, 2020, 4:59 PM IST

Updated : May 27, 2020, 5:45 PM IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా, మేనల్లుడు దీపక్​లను ఆమె వారసులుగా గుర్తించింది మద్రాసు హైకోర్టు. ఈ మేరకు జయలలిత ఎస్టేట్​, రూ.900కోట్లుకుపైగా విలువ చేసే ఆస్తులకు వారే హక్కుదారులుగా పేర్కొంది.

జస్టిస్​ ఎన్.​ కురుబకరన్​, జస్టిస్​ అబ్దుల్​ ఖుద్ధోసితో కూడిన ధర్మాసం.. జయలలిత ఆస్తులను దీపా, దీపక్​లు పర్యవేక్షించే విధంగా అనుమతినిచ్చింది.

జయలలిత నివాసం, ఇతర ఆస్తులను తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవాలని తమిళనాడు గవర్నర్​ బనవరిలాల్​ పురోహిత్​ ఇది వరకే ఆర్డినెన్స్​ జారీ చేశారు. తమను జయలలితకు వారసులుగా గుర్తించాలని దీపక్​ హైకోర్టులో పిటిషన్​ వేశారు. విచారణ అనంతరం వారిని వారసులుగా గుర్తించిన కోర్టు.. 'గ్రాంట్​ ఆఫ్​ లెటర్స్​ ఆఫ్​ అడ్మినిస్ట్రేషన్​' ప్రక్రియ కోసం అన్నాడీఎంకే సభ్యులు ఎన్​. పగజెన్​ది, పి.జానకీరమణ వేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

పియోస్​ గార్డెన్​ను జయలలిత మెమోరియల్​గా మార్చాలని తమిళనాడు ప్రభుత్వం భావించింది. అయితే దానికి బదులు ముఖ్యమంత్రి అధికారిక నివాసం, కార్యాలయంగా వినియోగించుకోవాలని సూచించింది హైకోర్టు. నివాసంలోని ఒక భాగాన్ని మెమోరియల్​గా మార్చుకోవచ్చని పేర్కొంది.

సంక్షేమ కార్యక్రమాల కోసం దీపక్​, దీపా.. జయలలిత పేరు మీద ట్రస్ట్​ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు హైకోర్టు తెలిపింది. వారికి అన్ని వేళలా వారి సొంత ఖర్చులతో భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Last Updated : May 27, 2020, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details