నక్సలైటుకు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన జవాను - రక్తదానె
ఎన్కౌంటర్లో గాయపడ్డ నక్సలైట్‌కు రక్తదానం చేసిన జవాను మానవత్వాన్ని చాటిచెప్పాడు.
![నక్సలైటుకు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన జవాను](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2376906-246-ce0da503-6ece-40e9-a792-001f31a51a92.jpg)
జార్ఖండ్ ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడ్డ ఓ నక్సలైట్‌కు సీఆర్పీఎఫ్ జవాను తన రక్తం దానం చేసి మానవత్వం చాటిచెప్పాడు. పశ్చిమ సింఘ్భమ్ జిల్లా- ఖుంటి సరిహద్దులో జనవరి 29న ఎన్ కౌంటర్ జరిగింది. కోబ్రా అనే ప్రత్యేక భద్రతాదళం ఐదుగురు మావోయిస్టులను మట్టుబెట్టింది. నెత్తుటి మరకల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ నక్సల్‌ను, జవాన్లు వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాజ్‌కమల్ అనే జవాను తన రక్తాన్ని దానం చేశాడు.
"జవాను రక్తదానం చేశాడు. ఉగ్రవాదిని కాపాడటానికి ఆయన రక్తదానం చేశాడు. తన జీవితంలోనే గొప్ప పని చేశాడాయన. ఇలాంటి వ్యక్తికి మేము సెల్యూట్ చేస్తాము. తనపై తుపాకీ ఎక్కుపెట్టిన నక్సలైట్కే ఇతను రక్తదానం చేశాడు."
--- కొమలేంద్ర కుమార్, వైద్యుడు.