తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ జేఎన్​యూలో విధ్వంసం.. విద్యార్థులపై దాడి - Jawaharlal Nehru University Students' Union president & students attacked

JNU students attacked by people wearing masks on campus
దిల్లీ జేఎన్​యూలో విధ్వంసం.. విద్యార్థులపై దాడి

By

Published : Jan 5, 2020, 8:36 PM IST

Updated : Jan 5, 2020, 9:30 PM IST

21:27 January 05

లెఫ్టినెంట్​ గవర్నర్​ స్పందన...

జేఎన్​యూ ఘర్షణపై దిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​ స్పందించారు. శాంతిని నెలకొల్పేందుకు అవసరమైన చర్యల్ని పోలీసులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు.  

21:01 January 05

ఏబీవీపీపై ఆరోపణలు...

జేఎన్​యూ విద్యార్థులపై దాడి చేసింది అఖిల భారత విద్యార్థి పరిషత్​ (ఏబీవీపీ) సభ్యులేనని వర్శిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 

20:43 January 05

ఖండించిన సీఎం...

జేఎన్​యూలో జరిగిన హింసపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రివాల్ స్పందించారు. ఘటన ఆశ్చర్యపరిచిందన్నారు. పోలీసులు వెంటనే హింసను ఆపాలని ఆదేశించారు. విద్యార్థులపై దాడికి తెగబడితే దేశం ఎలా  అభివృద్ధి చెందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

20:40 January 05

భారీగా పోలీసుల మోహరింపు...

జేెఎన్​యూ బయట భారీగా పోలీసులను మోహరించారు. వర్శిటీలో ఉద్రిక్తతలు తలెత్తిన కారణంగా పోలీసులు పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. 

20:23 January 05

దిల్లీ జేఎన్​యూలో విధ్వంసం.. విద్యార్థులపై దాడి

  • దిల్లీ జేఎన్‌యూలో విద్యార్థులపై దుండగుల దాడి
  • క్యాంపస్‌లో విద్యార్థులు, అధ్యాపకులపై దుండగుల దాడి
  • కార్లు ధ్వంసం చేసిన ముసుగు ధరించిన దుండగులు
  • దాడిలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఐషే ఘోష్‌కు గాయాలు
  • కర్రలు, రాడ్లతో తిరుగుతూ దాడులకు దిగిన దుండగులు
  • ఏబీవీపీ వర్గం తమపై రాళ్ల దాడి చేసినట్లు జేఎన్‌యూఎస్‌యూ ఆరోపణ
Last Updated : Jan 5, 2020, 9:30 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details