తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిందూ సంప్రదాయంలో జపాన్​ జంట పెళ్లి

జపాన్​ యువ జంట పెళ్లికి రాజస్థాన్​లోని జోధ్​పుర్ వేదికైంది. అది కూడా హిందూ సంప్రదాయ ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు.

young man
హిందూ సంప్రదాయంలో జపాన్​ జంట పెళ్లి

By

Published : Feb 11, 2020, 2:44 PM IST

Updated : Feb 29, 2020, 11:49 PM IST

హిందూ సంప్రదాయంలో జపాన్​ జంట పెళ్లి

రాజస్థాన్​ జోధ్​పుర్​లో జరిగిన ఓ వివాహ వేడుక చర్చనీయాంశంగా మారింది. జపాన్​కు చెందిన ఓ యువజంట హిందూ సంప్రదాయ ప్రకారం పరిణయమాడి ఒక్కటైంది.

మనోడి చొరవతో

జోధ్​పుర్​కు చెందిన వీరేంద్ర భండారి... వ్యాపార పనులపై తరచూ జపాన్​కు వెళ్లివస్తుండేవాడు. ఈ క్రమంలో అక్కడ తన మిత్రుడైన జపాన్​ దేశస్థుడు 'కాజుకీ'​ త్వరలో వివాహం చేసుకోనున్నట్లు వీరేంద్రకు చెప్పాడు.

అప్పుడు వీరేంద్ర... హిందూ సంప్రదాయ పెళ్లి గొప్పతనాన్ని కాజుకీ​కి​ వివరించాడు. భారతీయ పద్ధతిలో వివాహం చేసుకోవడం వల్ల వధూవరులు జీవితకాలం కలిసిమెలిసి సంతోషంగా ఉంటారని తెలిపాడు. వెంటనే తన పెళ్లిని హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు కాజుకీ. వధువు కుటుంబాన్ని ఒప్పించి ఫిబ్రవరి 10న వివాహానికి ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. అలా ​వీరేంద్ర చొరవతో జోధ్​పుర్​లో అంగరంగ వైభవంగా పెళ్లిచేసుకున్నాడు కాజుకీ.

మంత్రోచ్ఛరణలను చక్కగా

పెళ్లి మంత్రాలను వధూవరులు చక్కగా హిందీలో ఉచ్చరించారు. ఈ వేడుకకు 25 మంది జపనీయులు, స్థానికులు హాజరై... కొత్త జంటను ఆశీర్వదించారు.
గతంలోనూ వీరేంద్ర జపాన్​కు చెందిన ఓ యువజంటకు హిందూ సంప్రదాయంలో పెళ్లి జరిపించాడు.

ఇదీ చూడండి : అడవిలో గర్భిణిని భుజాలపై మోసుకెళ్లిన ఎమ్మెల్యే

Last Updated : Feb 29, 2020, 11:49 PM IST

ABOUT THE AUTHOR

...view details