తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జనతా కర్ఫ్యూ: ప్రజలందరూ ఇళ్లలో.. రోడ్లన్నీ ఖాళీగా - కరోనా వార్తలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

janata-curfew
జనతా కర్ఫ్యూ: ప్రజలందరూ ఇళ్లలో.. రోడ్లన్నీ ఖాళీగా

By

Published : Mar 22, 2020, 1:49 PM IST

దుకాణాలు, వ్యాపార సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలు, రోడ్లు ఇలా ఎటు చూసినా నిర్మానుష్యమే.. ఎక్కడ చూసినా నిశ్శబ్దమే. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు జనతా కర్ఫ్యూను పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన వచ్చింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు.

జనతా కర్ఫ్యూ: ప్రజలందరూ ఇళ్లలో.. రోడ్లన్నీ ఖాళీగా

అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బంద్‌ అయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడం వల్ల రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌, థియేటర్లు మూసివేసి స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూకు మద్దతు తెలుపుతున్నారు ప్రజలు.

ప్రధాన ప్రాంతాల్లో ఇలా...

నిర్మానుష్యంగా ఉన్న వీధులు

ఎప్పుడూ రద్దీగా ఉండే కర్ణాటక బెంగళూరు రహదారులు వాహనాలు లేక నిర్మానుష్యంగా ఉన్నాయి.

తమిళనాడులోని ధర్మబురిలో నిర్మానుష్యంగా వాణిజ్య కేంద్రం

తమిళనాడు ధర్మబురిలో దుకాణాలన్నీ మూసివేశారు. ఎక్కడా జనసంచారమే లేదు.

కేరళలోని కొల్లామ్​లో ప్రయాణికులు లేరు.. బస్సులు లేవు

కేరళ కొల్లాంలో రోడ్డుపై ఒక్కరు కూడా కనిపించడం లేదు.

జమ్ములో కట్టుదిట్ట భద్రత మధ్య...

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో జమ్మూలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది.

హిమాచల్​ ప్రదేశ్ సొలంగ్​ లోయలో ఎక్కడా ప్రజలు బయటకు రాలేదు

హిమాచల్​ ప్రదేశ్ సొలంగ్​ లోయలో ఎక్కడా ప్రజలు బయటకు రాలేదు.

హరియాణాలో తెరుచుకోని దుకాణాలు

హరియాణా, పంజాబ్​ రాష్ట్రాల్లో దుకాణాలు సహా వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి.

ఉత్తర్​ప్రదేశ్​లో వెలవెలబోతున్న ఓ రైల్వేస్టేషన్​

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూ రైల్వేస్టేషన్​ ప్రయాణికులు లేక వెలవెలబోతోంది.

దిల్లీ కనాంట్​ ప్రాంతంలో ప్రజలు లేక పావురాలమయం అయిన వీధులు

దిల్లీ కనాంట్​ ప్రాంతంలో వీధులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details