కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం - షోపియాన్ ఎన్కౌంటర్
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. షోపియాన్ జిల్లా డ్రాగద్ సుగాన్ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సైన్యం ప్రతిదాడిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్ము షోపియాన్లో ఎన్కౌంటర్
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. షోపియాన్ జిల్లా డ్రాగద్ సుగాన్ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేస్తున్న భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Last Updated : May 31, 2019, 3:09 PM IST