జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు, రాష్ట్ర విభజన తర్వాత అక్కడి ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు బహుముఖ కార్యచరణ అమలుకు కేంద్రం నిర్ణయించింది. అక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమలకు ఏడేళ్ల పాటు 'పన్ను విరామం' (టాక్స్ హాలీడే) ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. జీఎస్టీ సహా అన్ని రకాల పన్నుల మినహాయింపునకు కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంలోని 11 మంత్రిత్వ శాఖల ద్వారా ఒక దీర్ఘకాలిక కార్యచరణ ప్రణాళికను రూపొందించింది. ఇందులో లద్దాఖ్కూ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించనుంది. ప్రతి గ్రామానికి కనీసం ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్నిది ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యంగా ఉంది.
జమ్ముకశ్మీర్‌కు ఏడేళ్లపాటు టాక్స్ హాలీడే! - జీఎస్టీ
జమ్ముకశ్మీర్ ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి తొలగించేందుకు కేంద్రం బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇందులో భాగంగా ఏడేళ్లపాటు జీఎస్టీ సహా అన్ని రకాల పన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించింది. లద్దాఖ్‌కు ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చేందుకు సిద్ధమైంది.
మోదీ
ప్రణాళికలోని మరిన్ని కీలక అంశాలు
- స్థానిక యువతతో ఒక సీఆర్పీఎఫ్, ఒక బీఎస్ఎఫ్ బెటాలియన్ ఏర్పాటు
- ఇతర రాష్ట్రాల పోలీసులకు వర్తించే అన్ని సౌకర్యాలు వర్తింపు
- ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు స్థానిక ఉద్యోగుల జీతభత్యాలు
- 3 నుంచి 5 వరకు ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు
- విద్యుత్ ఛార్జీల తగ్గింపు
- కార్పొరేట్ ఆస్పత్రులు, విద్యాసంస్థల ఏర్పాటుకు చొరవ
- 14 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు వీలుగా విద్యా హక్కు చట్టం అమలు
- పెట్టుబడిదారుల సదస్సుల నిర్వహణ, ఏడేళ్ల పన్ను మినహాయింపు ప్రకటన
- సాహస, ఆధ్యాత్మిక, పర్యాటక ప్యాకేజీల అమలు
- లద్దాఖ్‌లో సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహం
ఇదీ చూడండి: అదిరే ఆఫర్లతో జియో ప్రారంభం.. ఉచితంగా 4కే టీవీ!
Last Updated : Sep 29, 2019, 2:51 PM IST