తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​లో భాగమైనా.. ఆ జిల్లా ఉగ్రవాద రహితం' - 'కశ్మీర్​లో భాగమైనా.. ఆ జిల్లా ఉగ్రవాద రహితం'

కశ్మీర్ అనంత్​నాగ్​ జిల్లా​లో సోమవారం జరిగిన ఎన్​కౌంటర్​లో హిజ్బుల్ ముజాహిదీన్ కీలక నేత హతమయినట్లు వెల్లడించారు కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్. ఈ నేపథ్యంలో జమ్ము జోన్​లోని దోడా జిల్లా పూర్తిగా ఉగ్రవాద రహితంగా మారినట్లు చెప్పారు.

masood
కశ్మీర్​లో భాగమైనా.. ఆ జిల్లా ఉగ్రవాద రహితం: డీజీపీ

By

Published : Jun 29, 2020, 12:22 PM IST

కశ్మీర్​ అనంత్​నాగ్ జిల్లా ఖుల్చోహార్ వద్ద జరిగిన ఎన్​కౌంటర్​లో హిజ్బుల్ ముజాహిదీన్ కీలక నేత మసూద్ హతమైనట్లు వెల్లడించారు రాష్ట్ర డీజీపీ దిల్బాగ్ సింగ్. మసూద్​ మృతితో దక్షిణ కశ్మీర్​లోని దోడా జిల్లా ఉగ్రవాద రహితంగా మారినట్లు చెప్పారు.

"దోడా జిల్లాలో ఇప్పటివరకు మిగిలి ఉన్న ముష్కరుడు మసూద్ మాత్రమే. సైన్యం, పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్​లో మసూద్ సహా ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఒక ఏకే 47 రైఫిల్, రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నాం."

- దిల్బాగ్ సింగ్, జమ్ముకశ్మీర్ డీజీపీ

విశ్వసనీయ వర్గాల సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేస్తుండగా పోలీసులపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారని.. బలగాలు దీటుగా సమాధానమివ్వగా ముగ్గురు హతమయ్యారని చెప్పారు డీజీపీ.

మసూద్ నేపథ్యం..

ఓ అత్యాచారం​ కేసులో నిందితుడిగా ఉండి పరారైన మసూద్ అనంతరం హిజ్బుల్​ ముజాహిదీన్​లో చేరాడు.

ఇదీ నేపథ్యం:కశ్మీర్​లో ఉగ్ర ఏరివేత- ముగ్గురు ముష్కరులు హతం

ABOUT THE AUTHOR

...view details