గలగలల దాల్ సరస్సు కళ తప్పెనే! జమ్ము కశ్మీర్లో 370 అధికరణం రద్దు ఆ ప్రాంత పర్యటక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.
జమ్ము కశ్మీర్ అనగానే అందమైన లోయలు, పొగ మంచు కప్పేసిన కొండలు, చల్లగా వీచే గాలులు, పొడవైన దేవదారు వృక్షాలు, హొయలు పోయే సరస్సులు కళ్ల ముందు కదలాడుతాయి. ఆ అందాలను చూసేందుకు దేశ విదేశాలనుంచి విచ్చేసే వీక్షకులతో ఆ ప్రదేశమంతా సందడిగా ఉండేది. కానీ ఆ అందాలకిప్పుడు ఆదరణ కరువైంది.
ఆర్టికల్ 370 రద్దుతో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతాయోనన్న భయంతో పర్యటక ప్రదేశాలన్నీ వెలవెలబోతున్నాయి. జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్కే ఆభరణంగా కొనియాడే దాల్ సరస్సు ఇప్పుడు కళ తప్పింది. ఆ రాష్ట్ర వార్షికాదాయంలో పూల సరస్సుగాను పిలిచే దాల్ కీలక పాత్రపోషిస్తుంది. కానీ, ఇప్పటి పరిస్థితులు ప్రభుత్వ ఆదాయంతో పాటు ఆ ప్రాంతంలోని చిన్న వ్యాపారస్థులకూ తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి.
ఇదీ చూడండి: ఎంత అదృష్టం ఉంటే ఆ చిన్నారి బతికి బైటపడ్డాడు!