జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్‌లోని బస్‌స్టాండ్ సమీపంలో గ్రనేడ్ దాడి చేశారు. ఈ ఘటనలో 20 మంది పౌరులు గాయపడ్డారు. ఇందులో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రస్తుతం శ్రీనగర్‌లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
జమ్ముకశ్మీర్‌లో గ్రనేడ్ దాడి.. 20 మందికి గాయాలు - Jammu and Kashmir: Six injured in a grenade attack near bus stand in Sopore
![జమ్ముకశ్మీర్‌లో గ్రనేడ్ దాడి.. 20 మందికి గాయాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4891411-thumbnail-3x2-terror.jpg)
16:51 October 28
జమ్ముకశ్మీర్‌లో గ్రనేడ్ దాడి.. 20 మందికి గాయాలు
ఘటన అనంతరం.. అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని నిర్బంధించి సోదాలు నిర్వహిస్తున్నాయి.
రెండు రోజుల వ్యవధిలోనే ఉగ్రవాదులు జరిపిన రెండో దాడి ఇది. ఈనెల 26న శ్రీనగర్‌లోని కరన్ నగర్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో ఆరుగురు సైనికులు గాయపడ్డారు.
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆంక్షలు విధించిన కేంద్రం ఇటీవల సడలించింది. దీంతో ఉగ్రమూకలు దాడులకు తెగబడుతున్నాయి. ఈయూ ఎంపీల బృందం కశ్మీర్‌ను సందర్శించనున్న ఒకరోజు ముందు ఈ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. వారి పర్యటన జరిగే అంశంపై అనుమానాలు నెలకొన్నాయి.
TAGGED:
JAMMU KASHMIR