తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు - స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 2020

జమ్ముకశ్మీర్​లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. బందిపొరా జిల్లాలో దివ్యాంగులు హాజరుకాగా, వారికి కావాల్సిన పరికరాలను ఈ సందర్భంగా పంపిణీ చేశారు.

Jammu and Kashmi : Pakage, Army celebrates ID with persons with disabilities
జమ్ముకశ్మీర్​లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

By

Published : Aug 15, 2020, 4:41 PM IST

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జమ్ముకశ్మీర్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాజకీయ, రాజకీయేతర ప్రముఖులు పాల్గొన్నారు. కశ్మీర్ లోయలోని అన్ని జిల్లాలకు చెందిన పోలీసులు, ఇతర భద్రతా దళాలతో పాటు పాఠశాల, కళాశాల విద్యార్థులు ఈ వేడుకల్లో చురుగ్గా పాల్గొన్నారు.

జమ్ముకశ్మీర్​లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

షోపియాన్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్ చౌదరి ముహ్మద్ యాసిన్ త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. ఇతర జిల్లాల్లోనూ సంబంధిత డిప్యూటీ కమిషనర్లు జెండాను ఆవిష్కరించారు. పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.

వేడుకల్లో పాల్గొన్న పోలీసులు
వేడుకల్లో పాల్గొన్న అధికారులు

పుల్వామా జిల్లాలోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. కుల్గాం​లోనూ వేడుకలు జరగగా, కరోనా విజృంభణ నేపథ్యంలో పోలీసుల కవాతును రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. బందిపొరా జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ మన్సాబ్​ అధికారులు.. దివ్యాంగులతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి కావాల్సిన పరికరాలను అందజేశారు.

ఇదీ చూడండిప్రధాని మోదీ స్వాతంత్ర్య ప్రసంగంలో హైలైట్స్​ ఇవే...

ABOUT THE AUTHOR

...view details