జమ్ముకశ్మీరులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు.
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం - జమ్ముకశ్మీరు
జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో భద్రత బలగాలు, తీవ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఓ ముష్కరుడిని మట్టుబెట్టాయి బలగాలు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
జమ్ముకశ్మీరులో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
ముష్కరులు దాగి ఉన్నారన్న పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి బలగాలు. జవాన్లపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. సైన్యం దీటుగా ప్రతిఘటించింది. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలం వద్ద ఆయుధాలు, మందు గుండు సామగ్రి లభ్యమయ్యాయి.
ఇదీ చూడండి:నేటి నుంచి బద్రినాథుడి దర్శనం