కశ్మీర్: ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి- 10 మందికి గాయాలు - కశ్మీర్లో గ్రెనేడ్ దాడి

11:38 October 05
జమ్ముకశ్మీర్‌లో గ్రనేడ్ దాడి
జమ్ముకశ్మీర్‌లో ముష్కరులు మరో దారుణానికి తెగబడ్డారు. అనంత్‌నాగ్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఆవరణలో గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 8 మంది పాదచారులు, ఓ పోలీస్, ఓ పాత్రికేయుడు ఉన్నారు.
అనంత్ నాగ్ జిల్లాలో అత్యంత పటిష్ఠ భద్రత ఉన్న ప్రాంతంలో తీవ్రవాదులు గ్రనేడ్ విసిరినట్లు అధికారులు వెల్లడించారు. నిర్దేశిత లక్ష్యాన్ని కాకుండా వేరే చోట అది పడినట్లు చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఉగ్రవాదుల చర్యతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.