జమ్ముకశ్మీర్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో లష్కరే తొయిబా కమాండర్ నసీరుద్దీన్ లోన్ ఉన్నట్లు కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.
షోపియాన్లోని చిత్రగామ్లో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆనంతరం బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది చనిపోయాడు. తుపాకీ, గ్రెనేడ్ లాంఛర్, నాలుగు చైనా గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.