తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జామియా కాల్పులు: మైనర్​కు తుపాకీ అమ్మిన రెజ్లర్​​ అరెస్ట్​ - దిల్లీ పోలీసులు

జామియా వర్సిటీ కాల్పుల ఘటనతో సంబంధం ఉన్న రెజ్లర్​ను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్​ ప్రదేశ్​కు చెందిన అజీత్​.. వర్సిటీలో కాల్పులకు తెగబడ్డ మైనర్​కు తుపాకీ అమ్మినట్టు అధికారులు ధ్రువీకరించారు. రేపు అతడిని కోర్టులో హాజరు పరచనున్నారు.

Jamia firing: Wrestler who supplied weapon to juvenile held
జామియా కాల్పులు: మైనర్​కు తుపాకీ అమ్మిన వ్రెస్లర్​ అరెస్ట్​

By

Published : Feb 3, 2020, 9:54 PM IST

Updated : Feb 29, 2020, 1:47 AM IST

జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల ఘటనతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని దిల్లీ క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఉత్తరప్రదేశ్​లోని అలీగఢ్​​కు చెందిన 25ఏళ్ల రెజ్లర్​ అజీత్​గా గుర్తించారు పోలీసులు. పౌర నిరసనకారులపై కాల్పులు జరిపిన మైనర్​కు అజీత్​​ తుపాకీ అమ్మినట్టు అధికారులు ధ్రువీకరించారు.

ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు... మంగళవారం అజీత్​ను కోర్టులో హాజరుపరచనున్నారు.

ఇదీ జరిగింది...

కాల్పుల ఘటన

జనవరి 30న మధ్యాహ్నం జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వద్ద ఓ దుండగుడు తుపాకీతో కలకలం సృష్టించాడు. సీఏఏ నిరసనకారులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థికి గాయాలయ్యాయి. మిగిలిన వారు అతడిని చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ విద్యార్థికి చికిత్స అందిస్తున్నారని... అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని అధికారులు తెలిపారు.

తుపాకీతో దాడికి తెగబడ్డ దుండగుడు మైనర్​ అని తెలుస్తోంది. అతడి వయసుకు సంబంధించిన సీబీఎస్​ఈ మార్క్​ షీట్​ సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తోంది.
భారీ పోలీసు బలగం ఉన్నప్పటికీ.. 'ఇదిగో మీ స్వేచ్ఛ' అంటూ ఆగంతుకుడు తుపాకీతో దాడికి పాల్పడ్డాడు. అంతకు కొద్ది సేపటి ముందు 'షాహీన్​బాగ్​ ఖేల్​ ఖతమ్​(షాహీన్​బాగ్​ పని అయిపోయింది)' అని ఫేస్​బుక్​లో పోస్టు చేశాడు.

శాంతియుతంగా సాగుతున్న నిరసనలు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడం వల్ల నిరసనకారులు తీవ్ర అసహనానికి గురయ్యారు.

Last Updated : Feb 29, 2020, 1:47 AM IST

ABOUT THE AUTHOR

...view details