తెలంగాణ

telangana

By

Published : Feb 10, 2020, 3:00 PM IST

Updated : Feb 29, 2020, 9:02 PM IST

ETV Bharat / bharat

దద్దరిల్లిన దిల్లీ.. నిరనకారులను అడ్డుకున్న పోలీసులు

Jamia to Parliament, stopped by security forces
సీఏఏ సెగ: కవాతును అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం

15:08 February 10

దద్దరిల్లిన దిల్లీ.. నిరనకారులను అడ్డుకున్న పోలీసులు

పెద్ద ఎత్తున ఆందోళన...

సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా జామియా నుంచి పార్లమెంటు వరకు కవాతు నిర్వహించేందుకు​ జామియా సహకార కమిటీ ( జేసీసీ) యత్నించింది. అయితే ఓఖ్లాలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రి వద్ద వారిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.

ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటేందుకు యత్నిస్తున్నారు.  

అటు పౌరసత్వ చట్టం, జాతీయ పౌర జాబితాకు వ్యతిరేకంగా సెంట్రల్​ దిల్లీలోనూ వందలాది మంది విద్యార్థులు, పౌర సమాజం సభ్యులు రహదారులపైకి వచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించారు.

సీఏఏ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టిన నిరసనకారులు మండీ హౌస్​ నుంచి జంతర్​మంతర్​ దిశగా యాత్ర చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్దఎత్తున పారామిలిటరీ బలగాలను మోహరించారు. 

యాత్రకు అనుమతి లేనప్పటికీ, శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నందున అడ్డుకోలేదని పోలీసులు తెలిపారు.
 
14:35 February 10

కవాతును అడ్డుకున్న పోలీసులు

సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లకు వ్యతిరేకంగా జామియా నుంచి పార్లమెంటు వరకు కవాతు నిర్వహించేందుకు​ జామియా సహకార కమిటీ ( జేసీసీ) యత్నించింది. అయితే ఓఖ్లాలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రి వద్ద వారిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.

ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను దాటేందుకు యత్నించారు.  
 
Last Updated : Feb 29, 2020, 9:02 PM IST

ABOUT THE AUTHOR

...view details