దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలకు కారణమైన తబ్లీగీ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్న కార్యకర్తలు.. క్వారంటైన్ కేంద్రాల్లో అనూహ్య రీతిలో ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే కొందరు తబ్లీగీలు వైద్య సిబ్బందిపై దాడికి దిగగా.. మరో ఇద్దరు తాజాగా ఉత్తర్ప్రదేశ్ నరేలాలోని క్వారంటైన్ గదుల ముందు మలవిసర్జన చేశారు. సంబంధిత అధికారుల నుంచి ఫిర్యాదు అందిన అనంతరం.. మలవిసర్జన చేసిన ఇరువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వారు ఉత్తర్ప్రదేశ్ బారాబంకీకి చెందినవారని తెలిపారు.
క్వారంటైన్ గదుల ముందు తబ్లీగీల మలవిసర్జన! - క్వారంటైన్ గదుల ముందు మలవిసర్జన చేసిన తబ్లీగీలు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తబ్లిగీ జమాత్ సభ్యులు మరోసారి వార్తల్లో నిలిచారు. ఉత్తరప్రదేశ్ నరేలా నిర్బంధ కేంద్రంలో ఉన్న ఇద్దరు తబ్లీగీలు క్వారంటైన్ గదుల ముందు మలవిసర్జన చేయడమే ఇందుకు కారణం. సదరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
![క్వారంటైన్ గదుల ముందు తబ్లీగీల మలవిసర్జన! Jamaat members defecate in front of Narela quarantine centre room](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6694521-133-6694521-1586247927384.jpg)
క్వారంటైన్ గదుల ముందు మలవిసర్జన చేసిన తబ్లీగీలు!
గతనెలలో దిల్లీలోని నిజాముద్దీన్ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్న వారందరినీ ప్రస్తుతం నెరేలాలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు అధికారులు. ఇందులో 212వ నెంబరు గది వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మొత్తం 15 మంది మృతి చెందారు. అలాగే ఈ ప్రార్థనల్లో కనీసం 9000 మంది పాల్గొన్నట్లు ప్రభుత్వ అంచనా.