ప్రకృతి విపత్తుల నుంచి రక్షించాలంటూ 'జలజపం' కేరళ త్రివేండ్రంలోని పద్మనాభస్వామి ఆలయంలో మురాజపం, జలజపం ఆచారాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మురాజపంలో రుగ్వేదం, సామవేదం, యుజర్వేదాలను పూర్తిగా పఠిస్తారు. ఇది 56 రోజుల పాటు జరుగుతుంది. ప్రస్తుతం రెండో దశ నిర్వహిస్తున్నారు. దశలు మారే కొద్ది.. వేద మంత్రాల శక్తి పెరుగుతుందని భావిస్తారు కేరళ ప్రజలు. అలాగే.. వేదాలను ప్రతి సంవత్సరం పఠించడం వల్ల దేశ ప్రజల శ్రేయస్సు మెరుగుపడుతుందని అభిప్రాయపడేవారూ ఉన్నారు. ఈ మురాజపాన్ని ప్రతి ఆరేళ్లకోసారి జరుపుతుంటారు.
95 ఏళ్లకు జలజపం...
మురాజపంతో పాటు.. ఇదే ఆలయంలో జలజపం(నీటి పూజ)ను కూడా నిర్వహించారు. దాదాపు 95 సంవత్సరాల తర్వాత ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు నిర్వహిస్తుండటం విశేషం. చివరగా 1920ల్లో ఈ కార్యక్రమాన్ని జరిపారు. పద్మతీర్థం చెరువు వద్ద మోకాళ్ల లోతు నీళ్లల్లో నిల్చొని వేదపండితుల ఆధ్వర్యంలో ఈ జలజపం నిర్వహిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల్ని నియంత్రించేలా చూడాలని వరుణదేవుడిని ప్రార్థిస్తూ ఈ నీటి పూజ చేస్తారు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు.. భక్తుల సమక్షంలో మురాజపం, జలజపాలను వేద పండితులు జరిపిస్తున్నారు.
ఇదీ చూడండి : ఝార్ఖండ్‌లో అసెంబ్లీకి తొలి విడత పోలింగ్ నేడే..