కేరళ పద్మనాభస్వామి ఆలయంలో 95 ఏళ్ల క్రితం జరిగిన సంప్రదాయ 'జలజపం' కార్యక్రమం పునఃప్రారంభమైంది. ప్రకృతి ప్రళయాలు, వాతావరణంలో పెను మార్పులు రాకుండా వరుణదేవుడ్ని ప్రసన్నం చేసకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
1920లలో జలజపంతోపాటు ముర జపం అనే ప్రత్యేక పూజ నిర్వహించేవారు. వేద పండితులు 'పద్మనాభ తీర్థం' కొలనులో మొకాళ్ల లోతు నీటిలోకి దిగి వేద మంత్రాలు ఉచ్ఛరించేవారు. ఎలాంటి ప్రకృతి విలయాలు సృష్టించకూడదని 56 రోజుల పాటు వరుణుడిని వేడుకునేవారు. ఇప్పుడు అదే తరహాలో పూజలు చేస్తున్నారు పండితులు.