భారతీయులందరికీ జల భద్రత కల్పించడమే లక్ష్యంగా జల శక్తి శాఖకు 2019-20 వార్షిక బడ్జెట్లో రూ.28,261 కోట్లు కేటాయించింది కేంద్రం. గతంలో వేర్వేరుగా ఉన్న తాగునీరు, పారిశుద్ధ్య, జల వనరులు, గంగానది ప్రక్షాళన మంత్రిత్వ శాఖలను ఏకం చేసి జలశక్తి శాఖగా మార్చింది.
బడ్జెట్-19: జలశక్తి శాఖకు రూ.28,261 కోట్లు - budget
వార్షిక బడ్జెట్లో జలశక్తి శాఖకు రూ. 28, 261కోట్లు కేటాయించింది కేంద్రం. దేశంలోని ప్రతి కుటుంబానికి సురక్షిత, తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.

బడ్జెట్-19: జలశక్తి శాఖకు రూ.28,261 కోట్లు
దేశవ్యాప్తంగా సుస్థిర నీటి సరఫరా నిర్వహణ లక్ష్యాల సాధన కోసం కేంద్ర కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో జలజీవన్ మిషన్ కింద 2024 నాటికి గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ఇళ్లకు కుళాయి నీటిని అందించేందుకు కృషి చేయాలని భావిస్తోంది.తాగునీరు, పారిశుద్ధ్యం విభాగం, నీటి నిర్వహణలో స్థానిక స్థాయిలో డిమాండ్‌కు తగ్గట్లు సరఫరాపై దృష్టి పెట్టనుంది.
ఇదీ చూడండి: బడ్జెట్ 2019-20 అంచనా: రూ. 27.86 లక్షల కోట్లు
Last Updated : Jul 6, 2019, 8:46 AM IST