కరోనా బారినపడిన ప్రముఖుల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
వైరస్ లక్షణాలు కనిపించినందున నిర్ధరణ పరీక్షలు చేయించుకోగా.. తనకు పాజిటివ్ వచ్చిందని తెలిపారు షెకావత్. వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలో చేరారని చెప్పారు. కొన్ని రోజులుగా తనకు సన్నిహితంగా మెలిగిన వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కోరిన మంత్రి.. లక్షణాలు ఉన్న వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.