తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జల్​అమియా: వంటింటి వస్తువులతో మురికి నీటిశుద్ధి

స్వచ్ఛమైన నీటికోసం భారీ ఖర్చు చేసే యంత్రాలను శాస్త్రజ్ఞులు కనుగొంటున్నారు. కానీ దీనికి భిన్నంగా వంటింటి వస్తువులతో మురికినీటిని తాగునీటిగా మార్చగల ప్రకృతి మిశ్రమం తయారుచేసి మన్ననలు పొందుతోంది ఛత్తీస్​గఢ్​కు చెందిన  'హిమాంగి హల్దర్'​ అనే పాఠశాల విద్యార్థిని.

By

Published : Nov 10, 2019, 7:32 AM IST

Updated : Nov 10, 2019, 9:48 AM IST

ఇలా చేస్తే మురికి నీరుని మనం తాగచ్చు తెలుసా?

జల్​ఆమియా: వంటింటి వస్తువులతో మురికి నీటిశుద్ధి

నీటి కొరత నేడు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారింది. గ్రామాలు, పట్టణాలు మంచినీటి సమస్యతో సతమతమవుతున్నాయి. మంచినీరు లభ్యంకాక కొన్ని ప్రాంతాల వాసులు కాలుష్యమయమైన నీటినే తాగేస్తున్నారు. ఈ కారణంగా వ్యాధుల బారిన పడుతున్నారు సాధారణ ప్రజానీకం. ఈ నేపథ్యంలో ఛత్తీస్​గఢ్​కు చెందిన 'హిమాంగి హల్దర్'​ అనే పాఠశాల విద్యార్థిని వంటింటి వస్తువులతో నీటిని శుద్ధి చేసే ప్రకృతి మిశ్రమం తయారుచేసి అందరినీ అబ్బురపరుస్తోంది. దీనికి 'జల్​ అమియా' అనే పేరుపెట్టింది.

ఈ మిశ్రమ తయారీకోసం ఆరు నెలల పాటు పరిశోధన చేసింది హిమాంగి. రసాయనాలు ఉపయోగించకుండా కేవలం ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలతో ఈ మిశ్రమాన్ని తయారుచేసింది. దీన్ని ఉపయోగించి మురికినీరును తాగునీటిగా మార్చి ఎంచక్కా తాగేయ్యొచ్చు.

"ప్రస్తుతం జలసమస్య పెరిగిపోయి.. తాగేందుకు నీరు దొరకటం కష్టమైపోయింది. ఈ కారణంగా ప్రజలు మురికినీరుని తాగుతున్నారు. దీనివలన పచ్చకామెర్లు​, కలరా వంటి ప్రాణాంతకమైన వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనాలని అనుకున్నాను. మురికినీటిని ప్రకృతిలో లభ్యమయ్యే పదార్థాలతో తాగునీటిగా మార్చాలనుకున్నాను. ఫలితంగా ఈ జల్​ అమియా అనే మిశ్రమాన్ని తయారుచేశాను. "

-హిమాంగి హల్దర్​, విద్యార్థిని

మిశ్రమ తయారీ విధానం

ఓ కప్పులోకి కావల్సినంత నిర్మాలీ విత్తనాల పొడి, మునగకాయ, వేప, తులసి ఆకుల పొడి సమాన పాళ్లలో తీసుకొని తగినంత నీరు కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఒక లీటరు మురికినీటిలో 0.005మిల్లీలీటర్ల మిశ్రమాన్ని కలపాలి. నీటిలోని మలినాలను ఈ మిశ్రమం శుద్ధి చేయడం ద్వారా కొంత సమయం అనంతరం దానంటత అదే శుభ్రమైన తాగునీటిగా మారిపోతుంది. ఈ నీటిని తాగడం వలన ఏవిధమైన ప్రమాదం లేదని.. పూర్తి రసాయన రహిత మిశ్రమమని హిమాంగి వెల్లడించారు.

పలువురి ప్రశంసలు..

ఈ మిశ్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో పుణెలో ప్రదర్శన ఏర్పాటుచేశారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఐక్యరాజ్యసమితి కాప్14 సదస్సులో 'జల్​అమియ'ను కామన్​ వెల్త్​ దేశాల ప్రతినిధులు పరీక్షించారు. ఇంట్లో దొరికే గింజలతో నీటిని శుద్ధి చేస్తున్న ఈ మిశ్రమం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. పేటెంట్​ హక్కుల​ కోసం భారత ప్రభుత్వానికి నమూనాని పంపారు.

ఇదీ చూడండి : అయోధ్య తీర్పు: కట్టుదిట్టమైన భద్రత నీడలో దేశం

Last Updated : Nov 10, 2019, 9:48 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details