తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అరుణ్​ కోసం గద్గద స్వరంతో ఆజాద్ ప్రసంగం - jaitley condolence in rajya sabha -ajad praised jaitley

కేంద్ర మాజీ మంత్రి, దివంగత అరుణ్​జైట్లీకి రాజ్యసభ శ్రద్ధాంజలి ఘటించింది. సంతాప తీర్మానంపై చర్చ సందర్భంగా జైట్లీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్. జైట్లీది విలక్షణ వ్యక్తిత్వమని ప్రశంసలు కురిపించారు.

జైట్లీ సంతాప తీర్మానంపై ఆజాద్

By

Published : Nov 18, 2019, 1:36 PM IST

పార్లమెంట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. సభాపక్ష నేత సహా.. వివిధ పార్టీల ఫ్లోర్​ లీడర్లకు మాట్లాడే అవకాశం కల్పించారు.

జైట్లీ తనకు మంచి స్నేహితుడని చెప్పారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్. జైట్లీపై ప్రశంసల జల్లు కురిపించారు. జైట్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే సమయంలో ఆజాద్​ భావోద్వేగానికి లోనయ్యారు.

జైట్లీ సంతాప తీర్మానంపై ఆజాద్

"అరుణ్​జైట్లీ... నేను రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నప్పుడు సభాపక్షనేతగా పనిచేశారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు.. ఆయన రాజ్యసభలో విపక్షనేతగా వ్యవహరించారు. వివిధ అంశాలపై చర్చ జరుగుతూ సభలో వాడీవేడి వాతావరణం నెలకొన్నప్పుడు ఆయన లేచి తన చాతుర్యంతో సభను శాంతపరిచేవారు. అరుణ్​జైట్లీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను."

-గులాం నబీ ఆజాద్, రాజ్యసభలో విపక్ష నేత

ఇదీ చూడండి: 'ప్రకృతి' కోసం పార్లమెంట్​కు సైకిల్​పై వెళ్లిన ఎంపీ

ABOUT THE AUTHOR

...view details