చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.
తప్పు..నెహ్రూదే : అరుణ్ జైట్లీ
ఐరాస భద్రతా మండలిలో చైనా సభ్యత్వానికి అప్పట్లో మద్దతిచ్చింది మాజీ ప్రధాని నెహ్రూనేనని కేంద్ర మంత్రి జైట్లీ అన్నారు. అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు ఇప్పుడు అదే చైనా అడ్డుపడుతోందని చెప్పారు.
జైట్లీ
ఐరాస భద్రతా మండలిలో చైనా శాశ్వత సభ్యత్వానికి మద్దుతునిచ్చింది అప్పటి మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే అని గుర్తు చేశారు జైట్లీ. కశ్మీర్, చైనా విషయంలో తప్పు నెహ్రుదేనన్న ఆయన... 1955 ఆగస్టు 2న నెహ్రూ రాసిన లేఖను ప్రస్తావించారు.
దీనికంతటికి అసలైన బాధ్యులెవరో ఇప్పుడు రాహులే చెప్పాలని జైట్లీ ప్రశ్నించారు.